పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ మహేష్ హీరోయిన్

మరిన్ని వార్తలు

1-నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ నిన్న ఒక పెద్ద ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది.

ఆ వివరాల్లోకి వెళితే, ఆమె నిన్న ముంబైలో ఒక బిల్డింగ్ లో ఉన్న లిఫ్ట్ లో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయింది. దీంతో ఆమె మేనేజర్ వెంటనే అక్కడి సెక్యూరిటీ వారిని అప్రమత్తం చేయడంతో వారు ఆమెని భయటకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.

అయితే వారు ఒక గంట పాటు తీవ్ర ప్రయత్నం చేసి కృతిని బయటకి తీసుకువచ్చారు. సమయానికి ఆమె ఫోన్ లో సిగ్నల్ ఉండడంతో ఆమె ఈ విషయాన్ని తన మేనేజర్ కి చెప్పడం ద్వారా ఆమె సురక్షితంగా బయటపడగలిగింది.

ఇదే సమయంలో ఆమె విషయాన్ని అభిమానులకి చెప్పడం ఆ గంట పాటు ఆమె ఎటువంటి ఇబ్బంది, కంగారు లేకుండా తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా చాట్ చేయడం కొసమెరుపు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS