హీరో విశాల్- ఈపేరు ఈమధ్యకాలంలో తమిళనాట పెద్ద ఎత్తున వినపడిన పేరు. నడిగర్ సంఘం ఎన్నికల విజయం, తమిళ నిర్మాతల మండలిలో ఘన విజయం ఆ తరువాత ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి చేసిన ప్రయత్నాలలో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయారు.
అయితే నడిగర్ సంఘం కోసం పక్కా భవనం కట్టడం అందులో నిర్మించే కళ్యాణ మండపంలో మొదటి వివాహం తనదే అని ఎప్పుడో ప్రకటించేశాడు విశాల్. ఇక ఇప్పుడు దానికి సంబందించిన అడ్వాన్సు ని కూడా ఆయన చెల్లించినట్టుగా తెలిపాడు.
వచ్చే ఏడాది కల్లా ఈ భావన నిర్మాణం పూర్తికానుంది. అయితే ఇంతలోపు ఇంట్లో వాళ్ళు విశాల్ కోసం అమ్మాయిని వెతుకుతారా లేక ఇప్పుడు వస్తున్న పుకార్ల ప్రకారం హీరోయిన్ వరలక్ష్మిని చేసుకుంటాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఏదేమైనప్పటికీ ఆయన మాట నిలబెట్టుకునే క్రమంలో ఆయన మరో ముందడుగు వేశాడు.