చిన్న సినిమాని తక్కువంచనా వేయద్దండోయ్‌.!

మరిన్ని వార్తలు

చిన్న సినిమా అని లైట్‌ తీసుకోవడమనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. చిన్న సినిమా కాస్తా హిట్‌ అయ్యిందా అంతే సంగతి. బిగ్‌ టాక్‌ సంపాదించేస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట పండించేస్తోంది. కొంచెం పోజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ సినిమా స్వరూపం మారిపోతోంది. వైరల్‌ టాక్‌తో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఆ కోవలో ఇటీవల విడుదలైన 'గూఢచారి' సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఈ సినిమాని మెచ్చుకుంటూ టీమ్‌కి కంగ్రాట్స్‌ తెలిపారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా 'గూఢచారి' సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశానని చిత్ర యూనిట్‌ని అభినందించారు. టాలీవుడ్‌లో ఇదో గొప్ప స్పై థ్రిల్లర్‌ మూవీ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. 

అడవిశేష్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిర్మాణ విలువల పరంగా అద్భుతంగా చిత్రీకరించారు ఈ చిత్రాన్ని. అడవిశేష్‌ అందించిన కథకు స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. అడవిశేష్‌ నటన అద్భుతంగా ఆకట్టుకుంటోంది. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 

చాలా కాలం తర్వాత అక్కినేని హీరోయిన్‌ సుప్రియ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS