‘ఎప్పటి నుండి మీరు ‘సార్’ అని పిలవడం మొదలు పెట్టారు.. దయచేసి ఎప్పటిలాగే ‘బ్రదర్’ అని పిలవండన్నా..’ అని తెలంగాణా మంత్రి కేటీఆర్, జనసేనాని పవన్ కళ్యాణ్‌కి విన్నవించారు. కరోనా వైరస్ కోరల నుండి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నంగా తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నియమాల్ని ప్రశంసిస్తూ.. ‘కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశంసించదగ్గ విధంగా నడుచుకుంటున్న మీ తీరుకు హృదయ పూర్వక అభినందనలు.. ఆదర్శంగా నిలుస్తున్నారు.. ధన్యవాదాలు సార్..’ అని కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కి కేటీఆర్ ‘సార్ అని పిలవద్దు అన్నా. ఎప్పటిలాగే బ్రదర్ అని పిలవండి..’ అని పవన్‌ని కోరారు. కరోనా బాధితుల్ని ఆదుకునే నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు 50 లక్షల చొప్పున, కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Thanks Anna 👍
— KTR (@KTRTRS) March 26, 2020
Since when did you start calling me sir! Always a brother pls! https://t.co/XpKqTZNOxZ
ఈ విషయంలో ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచినందుకు గొప్ప సందేశమిచ్చారు అన్నా.. అంటూ ముందుగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ రెస్పాన్స్‌కి పవన్, ‘సార్’ అంటూ కేటీఆర్‌ని అభినందిస్తూ పై విధంగా రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, ఎప్పటిలాగే తనని ‘బ్రదర్’ అని పిలవమంటూ పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.