బర్త్‌డే సందర్భంగా చరణ్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తానని నిన్న రాత్రే చెప్పాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా.. అంటూ చరణ్ రిప్లై ఇచ్చాడు. చరణ్‌తో పాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా ‘వెయిటింగ్’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే, చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గిఫ్ట్ సిద్ధం చేశాడు. కానీ, అది నిన్న రాత్రి జక్కన్నకు పంపించాడట. జక్కన్న సంగతి తెలిసిందే కదా.. ఓ పట్టాన ఆయనకు ఏదీ నచ్చదు. లాస్ట్ మినిట్ వరకూ బెస్ట్ ఫినిషింగ్ కోసం చెక్కీ...చెక్కీ.. చెక్కుతూనే ఉంటాడు. అలా అనుకున్న టైమ్‌కి గిఫ్ట్ చరణ్‌ని చేరడానికి కాస్త టైమ్ పట్టింది. దాంతో ఎన్టీఆర్‌ని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
చరణ్ గిఫ్ట్‌ని జక్కన్నకు ఎందుకు పంపావ్.? అని. ఇదంతా సోషల్ మీడియాలో చరణ్ బర్త్‌డే సందర్భంగా జరుగుతోన్న ఛాటింగ్. భలే ఇంట్రెస్టింగ్‌గా, పండగలా నడుస్తోంది ఈ సోషల్ మీడియా ముచ్చట. మరింకెంత సేపు జక్కన్న చెక్కుతాడో కానీ, చరణ్‌కి ఎన్టీఆర్ ఇవ్వబోతున్న ఆ బర్త్‌డే గిఫ్ట్ కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయించినా, జక్కన్న బాబూ.. జక్కన్న అంతే. ఖచ్చితంగా కడుపు నిండిపోయే సర్‌ప్రైజే ఇస్తాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!