మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఫ్యామిలీలో జాయిన్ అయితే, ఇప్పటికే లక్షల కొద్దీ ఫాలోవర్స్ వున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించకపోవడమేంటి? మెగా కాంపౌండ్‌లో లుకలుకలకు ఇదే నిదర్శనం.. అంటూ నానా యాగీ జరిగింది ఓ సెక్షన్ మీడియాలో. కానీ, మెగా కాంపౌండ్‌లో ఎలాంటి విభేదాలకూ తావు లేదనే విషయం అల్లు అర్జున్ ట్వీట్‌తో నిరూపితమైపోయింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చిందంటూ మెగాస్టార్‌కి సవినయంగా ట్విట్టర్‌లోకి స్వాగతం పలికారు అల్లు అర్జున్ తన తాజా ట్వీట్‌తో. ఇంకేముంది? మెగా ఫ్యాన్స్‌లో సంబరాలు మిన్నంటాయి. నిజానికి, మెగాస్టార్‌కి వ్యతిరేకంగా సినీ పరిశ్రమలో ఎవరైనా వ్యవహరిస్తారా? అంటే ఖచ్చితంగా ‘కాదు’ అనే చెప్పాలి.
మెగాస్టార్ అందరివాడు.. ఈ విషయం అందరికీ తెలుసు. నందమూరి అభిమానులు కావొచ్చు, అక్కినేని అభిమానులు కావొచ్చు.. అందరూ మెగాస్టార్‌ని అభిమానించేవారే. కానీ, కొందరు హేటర్స్ ఎప్పుడూ హీరోల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రయత్నిస్తుంటారు. బాలకృష్ణకీ, చిరంజీవికీ మధ్య స్నేహం వుంది. మరి, అభిమానులెందుకు కొట్టుకోవాలి.? ఇతర హీరోల అభిమానులే మెగాస్టార్‌ని అభిమానిస్తోంటే, మెగా కాంపౌండ్‌లో హీరోలు, మెగాస్టార్‌ని కాదనుకోగలరా.? అవకాశమే లేదు. పైగా, ‘చిరంజీవి మహా వృక్షం.. మేం ఆయన వల్లే ఈ స్థాయిలో వున్నాం..’ అని పలు మార్లు చెప్పిన అల్లు అర్జున్, మెగాస్టార్ ట్విట్టర్‌లోకి రావడంపై స్పందించకుండా వుంటారని ఎవరైనా ఎలా అనుకున్నారట.?