బాహుబలి చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమని స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో పెంచింది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా సాధించిన వసూళ్ళు కూడా ఒక రకంగా ఈ చిత్రం గురించి అందరూ చర్చించుకునేలా చేసింది.
ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఈ సంవత్సరపు బడ్జెట్ లో ప్రకటించిన నిధులు కనీసం బాహుబలి చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ అంతా కూడా లేవు అని తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
వారు ఎవరంటే- తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ లో దీని గురించి మాట్లాడగా, ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహేష్ బావ MP గల్లా జయదేవ్ ఏకంగా ఇదే మాటని పార్లమెంటు లో అనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి బాహుబలి చిత్రం ఇటు సినీ ప్రియులనే కాక అటు రాజకీయ నాయకులని సైతం విపరీతంగా ఆకర్షించింది.