సీనియర్ బాలీవుడ్ హీరో జితేంద్ర పై లైంగిక వేధింపుల కేసు నమోదు అవ్వడం అది కూడా ఆయన మేనకోడలు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, దాదాపు 47 సంవత్సరాల క్రితం సిమ్లా లో ఒక చిత్రం షూటింగ్ జరిగిన సందర్భంలో జితేంద్ర స్వయంగా తనని అక్కడికి రమ్మని ఆహ్వానించగా తాను వెళ్ళినట్టు భాదితురాలు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఇక ఆ రాత్రి షూటింగ్ అయిపోయాక తనకి కేటాయించిన రూమ్ కి జితేంద్ర రావడం తాను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి అదే రూమ్ లో పడుకున్నాడు అని చెప్పుకొచ్చింది.
ఇక అర్థరాత్రి అయిన తరువాత తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె ఫిర్యాదు ఏకంగా హిమాచల్ ప్రదేశ్ డీజీపీ కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం #MeeToo అనే కాంపెయిన్ ద్వారా ఇనేళ్ళకి తాను ఈ విషయం వెలుగులోకి తేగలిగాను అని తెలిపింది. అయితే ఆ సమయంలోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ఆమెని ప్రశ్నించగా, తన తల్లిదండ్రులు అప్పట్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న జితేంద్ర ని ఎదుర్కొనేందుకు భయపడి మిన్నకుండిపోయాము అని చెప్పింది.
ఈ ఫిర్యాదు పై జితేంద్ర ఇప్పటివరకు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నారు.