దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో తెలుగు సినిమా అంటే ఇంతకుముందు చిన్న చూపు ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్రాలు, తెలుగు నటులు సాధించే విజయాలు చూసి ప్రశంసించని వాళ్ళు ఉండరు. బాహుబలి వంటి చిత్రం మన దేశం లోనే అత్యంత వసూళ్లు సాధించి అందరినీ తెలుగు తెర వైపు చూసేలా చేసింది. ఇప్పుడు అదే ధోరణి లో రెబెల్ స్టార్ ప్రభాస్ మరొకసారి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా 'సాహో' ను మన ముందుకు తీసుకొచ్చాడు.
మొదటి రోజే ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినా వసూళ్ల వర్షం కురిపిస్తుంది సాహో. తాజాగా తెలుగు సినిమాలను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుండే 'టీఆర్ఎస్' వర్కింగ్ ప్రసిడెంట్ 'కేటీఆర్' తాజాగా 'సాహో' చిత్రాన్ని చూసారు. అద్భుతమైన టెక్నీకల్ వాల్యూస్ తో 'సాహో' ని తెరకెక్కించారని, మూవీ మేకర్స్ స్థాయిని పెంచిన సినిమా సాహో అని, ప్రభాస్ మరియు సుజీత్ ని ప్రశంసలతో ముంచెత్తారు. 3 రోజుల్లో సుమారు ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లు సాధించిన సాహో ఇక ముందు ఎలా సాగుతుందో చూడాలి.
Watched two fabulous Telugu movies today; #Saaho was technically brilliant & raised the bar for movie makers in India. Compliments to #Prabhas and #Sujeeth ??#Evaru was brilliant for its gripping screenplay & fabulous performances by @AdiviSesh @reginacassandra @Naveenc212 ??
— KTR (@KTRTRS) September 1, 2019