ఫిదా చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులని ఫిదా చేసిన ఫిదా టీం, ఇప్పుడు ఈ చిత్రం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని ఫిదా చేసింది.
ఆ రాజకీయ నాయకుడు మరేవరో కాదు- తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటీఆర్. కొద్దిసేపటి క్రితమే తాను ఫిదా చిత్రం చూసి ఫిదా అయినట్టు అలానే ఇంతటి చక్కని చిత్రాన్ని తెలంగాణ నేపధ్యంలో తీసినందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకి అభినందనలు తెలిపాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఈ చిత్రానికి ఫిదా అయ్యారు.