ఈ మధ్యనే “నాభి పై కొబ్బరిచిప్ప” అంటూ తాప్సీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందంటే, తాప్సీ ఈ అంశం పై అందరికీ క్షమాపణలు చెప్పుకునే అంత వరకూ.
ఇప్పుడిప్పుడే ఆ కాంట్రవర్సీ చల్లారిపోయింది అనుకుంటున్న తరుణంలో మరొకసారి “నాభి పై కొబ్బరిచిప్ప” టాపిక్ తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఒక ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో, ఆ విలేఖరి- మీ నాభి పైన ఎవరైనా కొబ్బరిచిప్ప వేస్తే ఏం చేస్తారు? అని అడగగా. ఆమె వెంటనే అలా చేసినవారిని అదే కొబ్బరిచిప్పతో కొడతాను అని సమాధానం ఇచ్చింది.
అయితే తనకి ఇప్పటివరకు అలాంటి పరిస్థితి అయితే ఎదురుకాలేదు అని ఒక వేళ గనుక అదే జరిగితే తను పైన చెప్పిన సమాధానమే జరుగుతుంది అని తేల్చిచెప్పింది.
ఈ టాపిక్ ని ఎంత మరిచిపోదాము అనుకుంటున్నా.. ఏదో ఒక వైపు నుండి పైకి వస్తూనే ఉంది.