దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్' అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఆ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా నటించాడు. కుమారి పాత్రలో హెబ్బా పటేల్ యూత్ మనసును గెలచుకుంది. ఈ సినిమాతో హెబ్బా పటేల్ హీరోయిన్గా బాగా పాపులర్ అయ్యింది. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు సూర్య ప్రతాప్ మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు. అది కూడా రాజ్‌తరుణ్‌తోనే కావడం గమనార్హం.
అయితే హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. ఇది కూడా మంచి లవ్ స్టోరీ. అప్పట్లో 'కుమారి 21 ఎఫ్' సినిమా డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. కానీ పలు వివాదాలను ఎదుర్కొంది. అప్పట్లో ఈ సినిమా విషయంలో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా వివాదాలు వచ్చాయి. అయినా కానీ సినిమా మంచి విజయం సాధించింది. కంటెన్ట్ ఉంటే సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరి వల్లా కాదు. అది కుమారి విషయంలోనూ జరిగింది.
కానీ తాజా సినిమాని మాత్రం క్లీన్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నారట. రాజ్‌తరుణ్‌తో జత కట్టబోయే ఆ అందాల భామ కోసం వెతుకులాట కొనసాగుతోందిప్పుడు. ఈ సినిమా కోసం రాజ్‌తరుణ్ డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తాడనీ సమాచారమ్. ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. రాజ్‌తరుణ్ ప్రస్తుతం 'రాజుగాడు' సినిమాతో బిజీగా ఉన్నాడు. అమైరా దస్తూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.