బెంగుళూరులో 'సన్నీనైట్' పేరుతో న్యూ ఇయర్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్‌కి వ్యతిరేకంగా కొంతమంది స్థానికులు ఆందోళన చేపట్టారు. సన్నీలియోన్ ఈ ఈవెంట్‌కి వస్తే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామనీ ఆ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
సన్నీలియోన్ హాజరైతే తమ రాష్ట్ర సాంస్కృతీ సాంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందనీ వారు అభిప్రాయపడుతూ, ఈ ఈవెంట్‌కి ఆమె రాక పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ పరిస్థితుల్లో ఈవెంట్ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉండగా, సన్నీలియోన్ నుండి ఈ వివాదంపై ఓ ఇంట్రెస్టింగ్ ప్రకటన వచ్చింది.
'అక్కడ ఈవెంట్ జరగడం కంటే ప్రజల భద్రతే నాకు ముఖ్యం. వారి భద్రతకు ముప్పు కలిగించేలా ఎలాంటి నిర్ణయం నేను తీసుకోలేను. ఈ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈవెంట్‌కి రాకూడదనీ నిర్ణయించుకున్నాను. అభిమానులు అర్ధం చేసుకోగలరు.. 'అంటూ సన్నీలియోన్ ఈ ప్రకటనలో వెల్లడించింది. పోర్న్ స్టార్‌గా పాపులరైన సన్నీలియోన్ ఇండియాకొచ్చి, ఇక్కడి సినిమాల్లో నటిస్తూ మెల్లగా భారతీయ సాంప్రదాయాలను గౌరవించడం నేర్చుకుంది. ఎంతో కొంత సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తోంది.
బాలీవుడ్‌లో హీరోయిన్‌గానే కాదు, ఐటెం సాంగ్స్‌తోనూ పాపులర్ అయ్యింది. అలాగే తెలుగు సినిమాపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవలే తెలుగులో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'గరుడవేగ' చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. సినిమా మంచి విజయం అందుకుంది. ఆ సాంగ్‌తో సన్నీకి తెలుగులో మంచి పేరొచ్చింది. ఏది ఏమైనప్పటికీ సన్నీలియోన్ సినీ జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే!