ఖుషి సినిమా అనగానే... పవన్, భూమికల నడుము సీన్ గుర్తొస్తుంది. ఆ సినిమాకి అదో ఐకానిక్ సీన్. ఆసీన్‌ని ఎన్ని సినిమాల్లో వాడుకొన్నారో? ఎన్ని టీవీ షోలలో ఇమిటేట్ చేశారో? జబర్‌దస్త్‌లో అయితే ఇప్పటికీ వాడుతుంటారు. ఇప్పుడు భోళా శంకర్‌లో ఈ సీన్‌ని రిపీట్ చేశారు. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా భోళా శంకర్. ఇదో మాస్, మసాలా మూవీ. ఇందు కోసం ఖుషిలోని బొడ్డు సీన్‌ని రీ క్రియేట్ చేశారు. ఖుషిలో పవన్ - భూమికల మధ్య ఈ సీన్ ఉంటే, భోళా శంకర్‌లో చిరంజీవి, శ్రీముఖిల మధ్య తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సీన్ చిత్రీకకణ పూర్తయింది.
ఇప్పటికే చాలామంది చాలాసార్లు వాడేసిన సీన్ ఇది. ఒకట్రెండు సార్లు చూస్తే... బాగుంటుంది. మళ్లీ మళ్లీ అదే చూడడం బోర్ కొడుతుంది. కాకపోతే పవన్ చేసిన ఐకానిక్ సీన్‌ని, చిరంజీవి చేస్తే.. ఆ మజానే వేరు. ఫ్యాన్స్‌కి సీన్ పండగలా ఉండొచ్చు. పైగా ఈ సినిమాలో చిరంజీవి వవన్ అభిమానిగా కనిపిస్తారని తెలుస్తోంది. అలా అయితే ఈ సీన్ మరింత బాగా పండే అవకాశం ఉంది. పైగా చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీన్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిపోతాడు. సో.. ఈ సీన్ క్లిక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.