ప్రముఖ నటుడు, రచయిత ఎల్బీ శ్రీరాం, వెండితెరపై ప్రదర్శించిన నటన, రాసిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన కామెడీ చేసినా, ఎమోషన్స్ పండించినా.. ప్రేక్షకుల మదిలో ఆయన వేసే ఇంపాక్ట్ ఇంకో రేంజ్‌లో వుంటుంది. తాజాగా ఎల్బీ శ్రీరాం ‘హార్ట్ ఫిలింతో వచ్చారు.. అదేనండీ షార్ట్ ఫిలిం. కరోనా వైరస్ - లాక్ డౌన్ - సోషల్ డిస్టెన్స్ వంటి అంశాల నేపథ్యంలో ఈ షార్ట్ ఫిలిం రూపొందింది. ఒకే ఒక్క పాత్ర ఇందులో కన్పిస్తుంది. మిగతా పాత్రలు మాట్లాడతాయంతే.. అంటే వాళ్ళు కన్పించరు, వాళ్ళ మాటలు విన్పిస్తాయి. తన కళ్ళద్దాల కోసం కుటుంబ సభ్యుల్ని అడుగుతుంటాడు ఎల్బీ శ్రీరాం.
చిత్రమేంంటంటే ఆయన కళ్ళద్దాలు పెట్టుకునే అన్ని పనులూ చేసేస్తుంటాడు. అద్గదీ అసలు విషయం. సోషల్ డిస్టెన్స్ ఎలా పాటించాలి.? అనేది చెప్పడమే కాదు, ఎంకి పాటలు ఎవరివి.? తాజ్‌మహల్ కట్టించిందెవరు.? వంటి ప్రశ్నలకు సమాధానాలూ ఇందులో ఆసక్తికరంగా చెప్పేశారు. భార్య, కుమారుడు, కోడలు, మనవడు.. ఇలాంటి పాత్రధారులున్నాయి షార్ట్ ఫిలింలో. వాల్ళెవరూ కన్పించరు, విన్పిస్తారంతే. చెస్ ఆడుతూ, ఆ చెస్‌లో రాజుని ప్రజలతో పోల్చి, మంత్రిని ప్రధాన మంత్రితో పోల్చడంలోనే ఎల్బీ శ్రీరాం చాతుర్యం కన్పిస్తుంది. ఓవరాల్‌గా ఇదొక అద్భుతమైన అనుభూతి.!