'దేవదాస్‌' సెలబ్రేషన్స్‌ షురూ.!

By iQlikMovies - September 12, 2018 - 14:37 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున - నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ 'దేవదాస్‌'. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సందర్భానుసారంగా సినిమాలోని గణపతి పాటను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. 

'లకలక లకుమీకర లంబోదరా..' అంటూ సాగే పాటను రిలీజ్‌ చేసింది. ఫుల్‌ జోష్‌తో నాగార్జున, నాని చిందేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు ఈ సాంగ్‌లో. పక్కా మాస్‌ స్టెప్పులతో ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉందీ సాంగ్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ డాన్‌ 'దేవ్‌' పాత్రలో నాగార్జున నటిస్తుండగా, డాక్టర్‌ 'దాస్‌' పాత్రలో నాని నటిస్తున్నాడు. ఈ డాన్‌ చేతిలో గన్‌ ఉండదు. ఈ డాక్టర్‌కేమో అస్సలు పేషెంట్సే ఉండరట. అలాంటి వీరిద్దరికీ ఎలా కనెక్షన్‌ కుదరింది? అనే నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందింది. 

భిన్నమైన కథలను ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్‌ అయ్యేలా తెరపై ఆవిష్కరించి చూపించడంలో యంగ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య సిద్ధహస్తుడు. ఓ సీనియర్‌ హీరో నాగార్జునతో, యంగ్‌ హీరో నానిని మ్యాచ్‌ చేస్తూ ఈ స్టోరీని ఎలా రూపొందించాడో తెలియాలంటే సినిమా రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. ఫుల్‌ లెంగ్త్‌ ఫన్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్‌ నటిస్తోంది. 

నేచురల్‌ స్టార్‌తో నేచురల్‌ అండ్‌ రైజింగ్‌ బ్యూటీ రష్మికా మండన్నా జత కడుతోంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS