'వీరగ్రంధం'లో 'ఆమె' ఎవరు?

మరిన్ని వార్తలు

స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించక ముందు ఆమె ఏంటి? అనే ఆశక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించేందుకు అలనాటి నటి వాణీ విశ్వనాధ్‌తో చిత్ర యూనిట్‌ సంప్రదింపులు చేసింది. స్టోరీ వాణీ విశ్వనాధ్‌ విన్నది. ఆమెకు స్టోరీ నచ్చింది. సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్లు కనిపించినా కానీ, ఆమెతో చిత్ర యూనిట్‌కి చర్చలు ఓ కొలిక్కి రాలేదట.  

అందులోనూ ఆమె ప్రస్తుతం రాజకీయాల వైపు కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తోంది. దాంతో ఆమె విషయం పక్కన పెట్టి, మరో హీరోయిన్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టింది చిత్ర యూనిట్‌. అందులో భాగంగా లక్ష్మీరాయ్‌ పేరు వినిపిస్తోంది. గతంలోనూ ఈ క్యారెక్టర్‌ కోసం లక్ష్మీరాయ్‌ని అనుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు లక్ష్మీరాయ్‌ ఒప్పుకుంటుందో లేదో సస్పెన్సే. తాజాగా ఈ సినిమా కోసం ఓ యంగ్‌ హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారమ్‌.  

అయితే ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించేందుకు సీనియర్‌ నటిని ఎంచుకుంటేనే బావుంటుందని భావిస్తున్నారు. అలాగే రాయ్‌ లక్ష్మీ నటించినా సినిమాకి వెయిట్‌ పెరుగుతుంది. స్టార్‌ వేల్యూ ఉంటే సినిమా వేల్యూ కూడా పెరుగుతుంది. రాయ్‌ లక్ష్మీ ప్రస్తుతం బాలీవుడ్‌లో 'జూలీ - 2' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24న 'జూలీ - 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' కోసం రాబోతున్న ఆ క్యారెక్టర్‌ ఎవరో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS