నిషా కళ్ల గ్లామర్‌ 'నిధి'

మరిన్ని వార్తలు

గ్లామర్‌ అంటే అంగాంగ ప్రదర్శనలో మాత్రమే ఉండదని చెబుతోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఆ లోగానే తన ఉనికిని చాటుకునేందుకు సోషల్‌ మీడియాలో అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. పిల్ల చాలా తెలివైంది. చూపించేదంతా చూపిస్తూనే, అందం అంటే ఎక్స్‌పోజింగ్‌ కాదంటోంది. అయితే తాజా పిక్‌ విషయానికి వస్తే, ఎక్స్‌పోజింగ్‌ ఏమంత లేకపోయినా, అమ్మడు చెప్పినట్లుగా కళ్లతోనే గ్లామర్‌ పండించేస్తోంది. చూస్తున్నారుగా ఆ కళ్లు. అబ్బో.! అదేదో సినిమాలో ఆర్తీ అగర్వాల్‌ కళ్లు చూసి వెంకటేష్‌ టెంప్ట్‌ అయినట్లుగా టెంప్ట్‌ అయిపోతున్నారా? అవును అవ్వాల్సిందే మరి. ఆ కళ్లలో అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ పలికేస్తున్నాయి. అందుకే అంత కాన్ఫిడెంట్‌ ఈ హాట్‌ బ్యూటీ తన అందాన్ని తానే పొగడకనే పొగిడేస్తోంది. అన్నట్లు ఈ బ్యూటీ ఎట్‌ ఏ టైమ్‌ అక్కినేని అన్నదమ్ములిద్దరితోనూ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసేస్తోంది. 'సవ్యసాచి'తో పాటు అఖిల్‌తో 'మిస్టర్‌ మజ్ను'లో కూడా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS