ఎన్టీఆర్ జీవితంపైన చిత్రాలు ప్రకటన జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న బాలకృష్ణ-తేజ కలయికలో ఆయన జీవితం పైన ఓ చిత్రం రాబోతున్నట్టు తెలిసింది.
అది మరువక ముందే ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతో ఒక చిత్రాన్ని ప్రకటించడం దాని చుట్టూత వివాదాలు కొనసాగుతుండడం చూస్తూనే ఉన్నాం. ఈ వివాదం ఒక కొలిక్కి రాక మునుపే లక్ష్మిస్ వీర గ్రంధం అనే ఒక చిత్రాన్ని నిన్న ప్రకటించారు.
దీనితో ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి ఒక్కసారిగా కలత చెందారు. ఆమె ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి కొద్దిసేపు అక్కడ మౌన దీక్ష నిర్వహించారు. తన అనుమతి లేకుండా తన పైన కాని చనిపోయిన తన భర్త పైన కాని సినిమాలు నిర్మిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆమె హెచ్చరించారు.
ఏదేమైనా ఎన్టీఆర్ జీవితం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.