ఆనందం, చుంబనం ఒక్కటేనా రత్తాలూ..!

మరిన్ని వార్తలు

'హ్యాపీనెస్‌ అంటే ముద్దులాంటిది. షేర్‌ చేస్తేనే ఎంజాయ్‌ చేయగలం..'అంటోంది ఓ ముద్దుగుమ్మ. ఇంతకీ హ్యాపీనెస్‌ గురించి ఇంత బాగా ఎక్స్‌ప్లైన్‌ చేసిన ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? హాట్‌నెస్‌లో టాప్‌ లేపేసిన అందాల భామ రాయ్‌ లక్ష్మీ. 

'జూలీ 2' సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేసేయాలనుకున్న అమ్మడి ఆశలు ఆడియాశలైపోయాయి. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టేసరికి రాయ్‌ లక్ష్మీ బాలీవుడ్‌ ఎంట్రీ ఒకింత నిరాశపరిచిందనే చెప్పాలి. ఆ సినిమా కోసం రాయ్‌ లక్ష్మీ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందని పూర్తిగా కొట్టి పారేయలేం. కానీ సినిమా నిరాశ పరిచినా, ఆ సినిమాతో పాపులారిటీతో పాటు, చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానంటోందీ హాట్‌ బ్యూటీ. 

సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ అనేవి ఒక్క చోటే ఉండిపోవు. వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా జీవితంలో మరో మెట్టు ఎక్కేందుకు కొత్త దారి చూపిస్తాయంటూ పెద్ద లెక్చరే ఇచ్చేస్తోందీ ముద్దుగుమ్మ. అందుకే ఫుల్‌ హ్యాపీగా సోషల్‌ మీడియాలో హ్యాపీనెస్‌ గురించి కొత్తర్ధాలు పలుకుతోంది. హ్యాపీనెస్‌కి హాట్‌నెస్‌ టచ్‌ ఇచ్చి, మాటలతోనే తన ప్రత్యేకతను చాటుకుంది రాయ్‌ లక్ష్మీ. హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకుంటే ఎంత ఎంజాయ్‌ చేయగలమో. అలాగే ముద్దును కూడా షేర్‌ చేసుకుంటేనే ఎంజాయ్‌ చేయగలం అంటోంది. 

 

రాయ్‌ లక్ష్మీ ఉద్దేశ్యం ఏదైనా కానీ, యూత్‌కి ఈ మాట మరోలా కనెక్ట్‌ అయితేనే చిన్న ప్రాబ్లమ్‌. ఎనీవే తాను చాలా హ్యాపీగా ఉన్నానన్న విషయాన్ని హాట్‌గా ఇలా కన్‌వే చేసిందన్న మాట ఈ హాట్‌ బ్యూటీ రాయ్‌ లక్ష్మీ. ప్రస్తుతం తెలుగులో ఓ హారర్‌ థ్రిల్లర్‌ మూవీలో పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తోంది రాయ్‌ లక్ష్మీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS