ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీతో హాట్‌ బ్యూటీ.!

By iQlikMovies - September 21, 2018 - 17:42 PM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ'లో 'రత్తాలు రత్తాలు..' స్పెషల్‌ సాంగ్‌తో పక్కా పాపులర్‌ అయిపోయిన హాట్‌ బ్యూటీ లక్ష్మీరాయ్‌. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అంతగా ఆదరణ నోచుకోకపోయినా, మరింత పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది లక్ష్మీరాయ్‌. 

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. వాటిలో లక్ష్మీరాయ్‌ నటించిన తాజా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ తాజా అప్‌డేట్‌ బయటికి వచ్చింది. 'వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రమిది. 

రామ్‌ కార్తీక్‌, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైద్రాబాద్‌ సారధీ స్టూడియోస్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది ప్రస్తుతం. ఈ షూటింగ్‌లో భాగంగా లక్ష్మీరాయ్‌పై ఓ స్పెషల్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. సినిమాకి ఈ సాంగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానుందట. 'పాపా నీకేది ఇష్టం..' అంటూ సాగే ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో లక్ష్మీరాయ్‌ మాస్‌ స్టెప్పులు ఆడియన్స్‌కి మరోసారి 'రత్తాలు..' సాంగ్‌ తలంపుకు తీసుకొస్తుందట. 

ఇకపోతే ఈ సినిమా నేపథ్యం విషయానికి వస్తే ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే రత్తాలు 'వెంకటలక్ష్మి'గా ప్రేక్షకుల ముందుకు రానుందన్న మాట.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS