'స్నేక్‌ గాళ్‌'గా మారిపోయిన హాట్‌ బ్యూటీ

మరిన్ని వార్తలు

'జూలీ 2' సినిమాతో బాలీవుడ్‌ని తన హాట్‌ హాట్‌ అందాలతో ఏలేద్దామని రెడీ అయ్యింది అందాల భామ లక్ష్మీరాయ్‌. కానీ అక్కడి ప్రేక్షకులు ఎందుకో రాయ్‌ లక్ష్మీ అందాలకు కించెత్తైనా కంగలేదు. హాట్‌ హాట్‌ బికినీలతో ఎంత స్కిన్‌ షో చేసేసినా, లక్ష్మీరాయ్‌ని కూసింత కూడా పట్టించుకోలేదు. దాంతో ఏమాత్రం మొహమాటపడకుండా యూ టర్న్‌ తీసుకుని సౌత్‌ సినిమాలపై దృష్టి పెట్టిందీ భామ. 

'జూలీ 2' కోసం ఈ అందాల భామ పడిన కష్టాన్ని బాలీవుడ్‌ పట్టించుకోకపోయినా, టాలీవుడ్‌, కోలీవుడ్‌లు మాత్రం అక్కున చేర్చుకున్నాయి. 'జూలీ 2' తర్వాత క్రేజీ ఆఫర్స్‌ ఇచ్చి వెల్‌కమ్‌ చెప్తున్నాయి. తెలుగులో అంజలితో కలిసి ఓ చిత్రంలో పవర్‌ ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్న లక్ష్మీరాయ్‌కి మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ తగిలింది. 1979లో కమల్‌హాసన్‌, శ్రీప్రియ జంటగా తెరకెక్కిన 'నీయా' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ రాబోతోంది. ఆ సీక్వెల్‌లో హీరోయిన్‌గా లక్ష్మీరాయ్‌ని ఎంచుకున్నారట. ఈ పాత్ర చాలా ప్రత్యేకమైన పాత్ర అంటోందీ ముద్దుగుమ్మ. అప్పట్లో సంచలన విజయం అందుకుందీ చిత్రం. 

అప్పుడు శ్రీప్రియ పోషించిన పాత్రనే ఇప్పుడు లక్ష్మీరాయ్‌ పోషిస్తోంది. ఈ సినిమా ప్రత్యేకతలను గురించి చెబుతూ, ఇదో ఫాంటసీ చిత్రం. ఈ సినిమాలో తాను నాగుపాము పాత్రలో కనిపిస్తున్నాననీ లక్ష్మీరాయ్‌ చెబుతోంది. నిజంగా ఈ క్యారెక్టర్‌లో నటించే ఛాన్స్‌ వచ్చినందుకు చాలా థ్రిల్‌ ఫీలవుతున్నాననీ అంటోంది. నాగుపాము చుట్టూ నడిచే కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనుందట లక్ష్మీరాయ్‌. ఈ మూడు పాత్రలూ సినిమాకి చాలా కీలకమట. 

తనకి సౌత్‌లో మంచి పేరు తీసుకొచ్చే సినిమాగా 'నీయా 2' నిలుస్తుందనీ లక్ష్మీ రాయ్‌ నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందట ఈ సినిమా. లక్ష్మీరాయ్‌తో పాటు ముద్దుగుమ్మ కేథరీన్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపంచనుందీ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS