మోహన్ బాబు నిర్మించి నటించిన చిత్రం 'గాయత్రి' గతవారం విడుదలైంది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మోహన్ బాబు అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
అయితే కొద్దిసేపటి క్రితం మోహన్ బాబు ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ వ్యాఖ్యలు ఏంటంటే- ఈరోజుల్లో సినిమాలు విడుదలైన మరుసటి రోజునుండే ఆ చిత్రాలని పైరసీ చేసి అంతర్జాలంలో పెట్టేస్తుండడం అలాగే మరి కొన్ని చోట్లలో సీడీలు, డీవీడీల రూపంలో కూడా చిత్రాలని పైరసీ చేస్తున్నారు అని. ఇలా చేసే వారిని నీచులు.. నికృష్టులు.. దుర్మార్గులు తో పోల్చారు మోహన్ బాబు.
ఈ పైరసీ భూతం త్వరలోనే అంతర్ధానం అవ్వాలి అని ఆయన కోరుకున్నారు. ఇది చేసే వాళ్ళు కూడా తాము చేస్తున్నది ఎంతవరకు సమంజసం అనేది తెలుసుకోవాలి అని సూచించారు. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన వారు కూడా మాట్లాడుతూ- సినిమా బతకలేకపోవడానికి కారణాలలో పైరసీ కూడా ఒక ముఖ్య అంశం అని తేల్చి చెప్పారు.
ఏదేమైనా మోహన్ బాబు కోరుకుంటున్నట్టుగా పైరసీ భూతం త్వరలోనే అంతర్ధానం అవుతుందా లేదా అనేది చూడాలి.