ఇస్మార్ట్‌ 'ఐటెం'గా రత్తాలు ఫిక్సయ్యిందా.?

మరిన్ని వార్తలు

పూరీ జగన్నాధ్‌ తెరకెక్కిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో అదనపు గ్లామర్‌ యాడ్‌ అవ్వనుందన్న ప్రశ్నకు అవునేమో అని సంకేతాలు వినిపిస్తున్నాయి. రత్తాలుగా అలరించిన హాట్‌ బ్యూటీ లక్ష్మీరాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్‌గా హాట్‌ బికినీ ఫోటో ఒకటి పోస్ట్‌ చేసింది. దానికి అందాల భామ ఛార్మి లైక్‌ చేసింది. ఛార్మి ఇప్పుడు నటనకు దూరమై, నిర్మాణరంగంపై ఫోకస్‌ పెట్టిన సంగతి తెలిసిందే. 

 

పూరీతో కలిసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి తెర వెనుక కర్త, కర్మ అంతా ఛార్మినే. సో లక్ష్మీరాయ్‌ని ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం ఎంచుకున్నారేమో. అందుకే లక్ష్మీరాయ్‌ బికినీ ఫోటోకి ఛార్మి లైక్‌ చేసిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికే నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి లక్ష్మీరాయ్‌ ఐటెం గ్లామర్‌ ఖచ్చితంగా ప్లస్‌ అవుతుంది. 

 

రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరోవైపు లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా ప్రచార చిత్రాలతో లక్ష్మీరాయ్‌ పేరు టాలీవుడ్‌లో తెగ మార్మోగిపోతోంది. దాంతో ఇస్మార్ట్‌ శంకర్‌కి లక్ష్మీరాయ్‌ క్రేజ్‌ని వాడుకోవాలని చిత్రయూనిట్‌ భావిస్తోందట. చూడాలి మన రత్తాలు ఇస్మార్ట్‌ శంకర్‌తో కలిసి, హాట్‌ హాట్‌గా చిందేయనుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS