నానితో సాయి పల్లవి ఇంకోస్సారి.?

మరిన్ని వార్తలు

'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి మరోసారి నేచురల్‌ స్టార్‌ నానితో జత కట్టనుందట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఎంసీఏ' మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం నాని రెండు సినిమాలను లైన్‌లో పెట్టి ఉంచాడు. అందులో ఒకటి 'జెర్సీ' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఇటీవలే నాని - విక్రమ్‌ కుమార్‌ సినిమా గ్రాండ్‌గా లాంఛ్‌ అయ్యింది. 

 

ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో శరణ్య ఆల్రెడీ కన్‌ఫామ్‌ అయ్యింది. మిగిలిన నలుగురుకి సంబంధించి పక్కాగా క్లారిటీ లేదు. ప్రియా ప్రకాష్‌, రష్మికా తదితర ముద్దుగుమ్మల్ని పరిశీలిస్తున్నారు. తాజాగా సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవిని ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఎంచుకోబోతున్నారనీ తెలుస్తోంది. 

 

కథలో కీలకమైన ట్విస్ట్‌ కోసం సాయిపల్లవి క్యారెక్టర్‌ దించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు తమిళంలో సూర్య హీరోగా 'ఎన్‌జీకే' సినిమాలోనూ సాయిపల్లవి నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS