గ్లామ్‌షాట్‌: జిమ్‌లో బుసలు కొడుతున్న 'రత్తాలు'.!

మరిన్ని వార్తలు

రత్తాలుగా ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్న హాట్‌ భామ లక్ష్మీరాయ్‌ జిమ్‌లో ఇదిగో ఇలా బుసలు కొట్టేస్తోంది. యాష్‌ కలర్‌ టైట్‌ ఫిట్‌లో హట్‌ హాట్‌గా ధ్యాన ముద్రలు వేసి ఆడియన్స్‌ కోసం సొగసులారేసేస్తోంది. ప్రస్తుతం 'నాగకన్య' సినిమాలో నటిస్తోంది లక్ష్మీరాయ్‌. ఈ సినిమాని తెలుగు, తమిల, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు.

 

ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆశక్తి రేకెత్తిస్తున్నాయి. నాగినిగా లక్ష్మీరాయ్‌తో పాటు, కేథరీన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు, 'ఝాన్సీ'లో పోలీసాఫీసర్‌గా పవర్‌ఫుల్‌ రోల్‌ పోషిస్తోంది లక్ష్మీరాయ్‌. తాజాగా లక్ష్మీరాయ్‌ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ దిగిన పిక్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS