టీజర్‌ టాక్‌: హాట్‌ హాట్‌గా వెంకటలక్ష్మి కనిపించింది.!

మరిన్ని వార్తలు

వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి అంటూ లక్ష్మీరాయ్‌ అభిమానులు తహతహలాడిపోతున్నారు. తన ప్రియమైన అభిమానుల కోసం వెంకటలక్ష్మి కనిపించింది. లక్ష్మీరాయ్‌ నటించిన 'వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి' టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో లక్ష్మీరాయ్‌ అంగాంగ ప్రదర్శనను చూపించారు. చీరకట్టులో చూపించాల్సిన చోట చూపించి, దాచేయాల్సిన చోట దాచేసి లక్ష్మీరాయ్‌ అందాలు అంగాంగ ప్రదర్శన గావించాయి టీజర్‌లో. 

 

బ్లాక్‌ హాట్‌ శారీలో వెంకటలక్ష్మి ఆగమనం జరిగింది. తన నీలాల కురుల్ని అందంగా పక్కకు తీసి ముఖారవిందాన్ని చూపించింది వెంకటలక్ష్మి. ఫేస్‌లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌తో కుర్రోళ్లకు అసలు సిసలు గాలమేసేసింది. కిషోర్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మధునందన్‌, ప్రవీణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

టీజర్‌లో లక్ష్మీరాయ్‌ని హాట్‌గా చూపించినా, సినిమాలో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ దాగున్నాయట. ఇదేదో గ్లామర్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ అనుకుంటే పొరపాటే. ఏదో కొత్త విషయాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌ చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. త్వరలో 'వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలోగా మన రత్తాలు హాట్‌ హాట్‌ టీజర్‌ని చూసి పండగ చేసుకోవడమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS