'వీరగ్రంధం' కూడా లైన్‌లోకి వచ్చేస్తోందట

మరిన్ని వార్తలు

2019 జనవరి నెలలో స్వర్గీయ ఎన్టీఆర్‌ మీద పలు సినిమాలు రాబోతున్నాయి. 'ఎన్‌టిఆర్‌ కథా నాయకుడు', 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు' ఇప్పటికే రిలీజ్‌ డేట్స్‌ కన్‌ఫామ్‌ చేసుకోగా, లేటెస్ట్‌ ఎంట్రీ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కూడా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. 

తాజాగా మరో మూవీ ఎన్టీఆర్‌ మీదనే రూపొంది ప్రేక్షకుల ముందుకు ఇదే జనవరిలో రాబోతోందట. అదే 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమా. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ సినిమా రూపొందించబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈయన సినిమా షూటింగ్‌ ప్రారంభమయినట్లు వెల్లడించారు. అయితే కొన్ని కారణాలతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ కారణం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనట. ఆయన ఆపేయమన్నారు కాబట్టే సినిమా ఆపేశానని కేతిరెడ్డి అంటున్నారు. 

ఎప్పుడైతే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాని రామ్‌గోపాల్‌ వర్మ పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించారో, ఆ వెంటనే కేతిరెడ్డి లైన్‌లోకి వచ్చేశారు. ఎన్టీఆర్‌ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాల్ని 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'లో బాలకృష్ణ - క్రిష్‌ టీమ్‌ చూపించబోతుండగా, లక్ష్మీపార్వతి యాంగిల్‌లో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చూపించేందుకు ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారు. 

'లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమా, ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి రాకముందు, వచ్చిన తర్వాత.. 'ఆమె' చరిత్ర చూపించబోతోందట. ఏదేమైనా స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్‌ ఫైట్‌కి బాగానే ఉపయోగపడేలా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS