ఇటీవల కాలంలో ఏదైనా హాట్ న్యూస్ ఉందంటే చాటు, ఈజీగా వైరల్ అయిపోతోంది. అలాగే ఊహించని స్థాయిలో సెన్సేషన్ కూడా సృష్టిస్తోంది కూడా.అంతేనా, అంతే త్వరగానే వివాదాలకూ సెంటర్ ఆప్ ఎట్రాక్షన్ అవుతోంది. ఇటీవల రొమాంటిక్ చూపులతో ఒక్క వీడియోకే సెన్సేషన్ సృష్టించేసిన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సంగతి ఏమైందో అందరికీ తెలిసిందే. యూత్‌లో క్రేజ్ సంపాదించేసిన ఈ బ్యూటీ, అలాగే విమర్శకుల అస్త్రాలకు కూడా కేంద్రబిందువైంది. కోర్టులు కేసులు అంటూ వివాదాలనూ ఎదుర్కొంది.
ఎలాగోలా ఆమె ఈ వివాదం నుండి బయట పడిందంనుకుంటే, మరో మలయాళీ ఇప్పుడు రిస్క్ చేసి, కోరి వివాదాలను కొని తెచ్చుకుంది. ఏదో అవుతుందనుకుంటే, ఇంకేదో అయ్యిందన్నట్లు, 'బ్రెస్ట్ ఫీడింగ్'పై అవేర్‌నెస్ అంటూ 'గృహలక్ష్మీ' మలయాళ మ్యాగ్జైన్‌పై బహిరంగంగా బిడ్డకు పాలిస్తూ ఫోటోకి పోజిచ్చింది. అవేర్‌నెస్ సంగతి అటుంచితే, ఇప్పుడీ అందాల భామ కూడా వివాదాలను ఎదుర్కోక తప్పడం లేదు. కేరళకు చెందిన ఓ అడ్వకేట్ సదరు మ్యాగజైన్ మీదా, అలా ఫోటోకి పోజిచ్చిన మోడల్ జిలూ జోసెఫ్ పైనా కోర్టులో కేసు నమోదు చేశారు.
దాంతో ఇప్పుడు ఈ మోడల్ ఈ వివాదం నుండి ఎలా బయట పడుతుందో, ఈమె చేసిన ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌పై కేరళ కోర్టు ఎలా స్పందిస్తుందోనంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమె చేసిన ఆలోచన మంచిదే. కానీ ఆచరణలో ఏమైనా లోపముందేమో గ్రహించాలి. అయినా 'సంచలనం' 'వివాదం' అనే రెండు పదాలు ఇప్పుడు కవల పిల్లల్లా మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.