కిషన్ - చంద్రకళ అనే ఓ తెలుగు జంట అమెరికాలో తెలుగు సినీ నటీమణులతో ఫ్లెష్ ట్రేడ్ నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు చిక్కారు. అయితే ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరు? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఆరుగురు విక్టిమ్స్‌ని ఇప్పటికే అమెరికా పోలీసులు విచారించారు. వారికి సంబంధించిన వివరాలు బయటికి పొక్కడం లేదు.
తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గించుకుంటున్న ఓ కన్నడ నటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకొందరు నటీమణుల గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇవేమీ అధికారికం కాదు, పలానా నటి అంటూ జరుగుతున్న ప్రచారంతో మొత్తం సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఓ యాంకర్, ఓ సింగర్ కూడా బాధితుల్లో ఉన్నారట. రాకెట్ గురించి ఆరా తీస్తే, 50 నుండి 60 మంది దాకా బాధితులున్నట్లు తెలుస్తోంది. విచారణ అమెరికాలో జరుగుతోంది కాబట్టి, ఏ విషయం అధికారికంగా బయటికి పొక్కడం లేదు.
అమెరికాలోని తెలుగు సినిమాలతో సత్సంబంధాలున్న కొందరి ద్వారా ఈ వివరాలు బయటికి పొక్కుతున్నాయి. వీటిని పూర్తిగా విశ్వసించడానికి వీల్లేదు. కానీ రకరకాల ఈవెంట్స్ పేరుతో సినీ ప్రముఖుల్ని అమెరికాకి రప్పించడం, ఆ తర్వాత అక్కడ కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం నిజమేననీ, చాలా మంది అంటున్నారు.
అలా చూస్తే, ప్రతీ ఒక్కరినీ అనుమానించాల్సి వస్తుంది. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకి మొత్తం సినీ పరిశ్రమనే అనుమానించాల్సిన పరిస్థితి రావడం దారుణం.