ఈ ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అయితే వాటిలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'రాధ' ఫర్వాలేదనిపించింది. చైతూ హీరోగా వచ్చిన 'యుద్ధం శరణం' ఆశించిన ఫలితాన్నివ్వలేదనే చెప్పాలి. తాజాగా 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో నటిస్తోందీ బ్యూటీ. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ముద్దుగుమ్మ లేటెస్టుగా ఒక డెసిషన్ తీసుకుందట. ఇకపై వరుస పెట్టి సినిమాలు చేసేయకుండా, ఆచి తూచి సినిమాలు చేయాలని భావిస్తోందట. ఎన్ని ఎక్కువ సినిమాలు చేశామన్నది కాకుండా, ఎంత మంచి సినిమాలు చేశామన్నదే లెక్క అంటోంది. ఈ విషయం అమ్మడు లేట్‌గా గ్రహించినట్లుంది సుమీ. ఏది ఏమైనా లావణ్య గుడ్ డెసిషన్ తీసుకుంది. మంచి కథలను ఎంచుకుంటానంటోంది. అలాగే కథలో తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలను సెలెక్ట్ చేసుకుంటానంటోంది. అలాగే స్పీడు తగ్గించానన్నాను కదా అని వచ్చిన అవకాశాల్ని వదిలేసుకోననీ చెబుతోంది. కానీ చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుందట ఈ బ్యూటీ. అమ్మడి కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్ అంటే 'భలే భలే మగాడివోయ్', తర్వాత 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాలు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ రాలేదు లావణ్యకి. తాజాగా చేస్తున్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. లావణ్యతో పాటు అనుపమా పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.