హాట్‌ అండ్‌ స్పైసీ అందాల రాక్షసి.!

By iQlikMovies - September 28, 2018 - 16:04 PM IST

మరిన్ని వార్తలు

'అందాల రాక్షసి' సినిమాతో క్యూట్‌ అప్పీల్‌తో ఎంట్రీ ఇచ్చి, అందరి మదినీ దోచేసింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలేమీ దక్కించుకోలేదు. కానీ మారుతి దర్శకత్వంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం ఆమె కెరీర్‌ని టర్న్‌ చేసింది. సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకునేలా చేసింది. ఆ వెంటనే వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా కూడా లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ లావణ్య కెరీర్‌ స్లో అయ్యింది. అయితే ప్రస్తుతం సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా లావణ్య వరుస సినిమాల్లో నటిస్తోంది. మెగా కాంపౌండ్‌ హీరో అయిన వరుణ్‌తేజ్‌తో 'అంతరిక్షం' సినిమాలో నటిస్తోంది. అలాగే యంగ్‌ హీరో నిఖిల్‌ సరసన 'ముద్ర' సినిమాలోనూ లావణ్య నటిస్తోంది. సినిమాల సంగతి అటుంచితే, సోషల్‌ మీడియాలో హాట్‌ అండ్‌ స్సైపీ ఫోటో సెషన్స్‌కి లావణ్య ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. చూస్తున్నారుగా ఫోటో అద్దిరింది కదా. బాపురే ఈ అందాల రాక్షసి కైపెక్కించే చూపులు ఎక్కడో గాఢంగా గుచ్చేసుకుంటున్నాయి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS