కీర్తిసురేష్‌ని కెలికిన శ్రీరెడ్డి.!

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌ - కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతోన్న 'పందెంకోడి 2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటోంది. కాగా ఈ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశాల్‌ని శ్రీరెడ్డి గురించి అడిగితే విశాల్‌ స్పందించాడు. 

గతంలో విశాల్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయమై అప్పుడే విశాల్‌ రిప్లై ఇచ్చేశాడు. అయితే తాజాగా మరోసారి అవకాశం చిక్కింది కాబట్టి విశాల్‌ ముందు అదే విషయం ప్రస్థావనకు రాగా, ఏం మాట్లాడాడన్నది పక్కన పెడితే, దాని గురించి విశాల్‌ మాట్లాడుతుండగా ఆ పక్కనే ఉన్న కీర్తి సురేష్‌ కాస్త వెటకారంగా చూసిందట. ఆ చూపు శ్రీరెడ్డికి కనిపించిందట. ఆ వెటకారపు చూపులు శ్రీరెడ్డికి నచ్చలేదట. 

దాంతో శ్రీరెడ్డి, అనవసరంగా కీర్తిసురేష్‌పై ఫైర్‌ అయ్యింది. ట్విట్టర్‌లో కీర్తి సురేష్‌ని మాటలతో కెలికేసి వదిలిపెట్టింది. 'ఎప్పుడూ కెరీర్‌ ఒకేలా ఉండదు. ప్రస్తుతం సక్సెస్‌ల మీద ఉన్నావు కాబట్టి నీకు ఏమీ తెలియడం లేదు. సక్సెస్‌ ఎప్పుడూ వెన్నంటే ఉండదు. ఒక్కసారి బెడిసికొట్టిందంటే అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి.. అని కీర్తి సురేష్‌ని నోటికి వచ్చినట్లు ఆడి పోసుకుంది శ్రీరెడ్డి. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ రచ్చ చేసిన శ్రీరెడ్డిని ఇప్పుడు ఎంత చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 

సో ఎవరైతే ఎక్కువ పాపులారిటీలో వున్నారో వారిని కెలికితే కూసింతైనా తనని పట్టించుకుంటారేమో అని పాపం శ్రీరెడ్డి ఆశపడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS