తొలి సినిమాతోనే 'అందాల రాక్షసి' అన్పించుకున్న లావణ్య త్రిపాఠి, వెండితెరపై గ్లామర్ ఒలకబోసేయడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. 'భలే భలే మగాడివోయ్' సినిమాలో క్యూట్‌గా కన్పిస్తూనే, పాటల్లో హాట్ అప్పీల్‌ని పండించిన ఈ బ్యూటీ, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో చీరకట్టులోనే హాట్‌నెస్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిపోయింది. అటు గ్లామర్‌తో, ఇటు పెర్ఫామెన్స్‌తో సత్తా చాటుతోన్న లావణ్య, ఈ ఏడాది వరుస రిలీజ్‌లతో మరింత స్టార్‌డమ్ పొందేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఇదిగో ఇలా హాట్ అండ్ క్యూట్ పోజుతో ఎట్రాక్ట్ చేసేసింది అభిమానుల్ని. ఇందులో హాట్ అప్పీల్ ఏముంది? అంటారా! ఆమె కళ్ళు, ఆమె పెదవులు - ఇంతకన్నా హాట్ అప్పీల్ ఇంకేముంటుంది? హాట్ అప్పీల్ అంటే అంగాంగ ప్రదర్శన మాత్రమే కాదు, కళ్ళలోనే లోతైన భావాల్ని పండించేయొచ్చనడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమీ అవసరం లేదు. దటీజ్ అందాల రాక్షసి.