అందాల రాక్షసితో అరంగేట్రం చేసిన నిజంగానే అందాల రాక్షసి అనిపించుకున్న లావణ్య త్రిపాఠి.. ఆ తరువాత 'భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన లావణ్య త్రిపాఠికి ఆ తరువాత పొరపాటున ఒక్క విజయం కూడా రాలేదు. లావణ్య నటించిన ప్రతి సినిమా పల్టీ కొడుతూనే వస్తోంది. 'మిస్టర్, ఇంటిలిజెంట్' లాంటి సినిమాలైతే మీజరబుల్ ఫ్లాప్స్ గా మిగిలాయి.
అందుకే తన తాజా చిత్రం అర్జున్ సురవరం పై గంపెడు ఆశలు పెట్టుకుంది ఈ అమ్మడు. మరి ఈ సినిమా అయినా ఈ అమ్మడికి ఆశించిన విజయం తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. అనేక అవరోధాలు, ఆటుపోట్లు దాటుకొని 'అర్జున్ సురవరం ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లావణ్య కంటే ఈ సినిమా విజయం సాధించడం హీరో నిఖిల్ కి చాలా చాలా అవసరం. ఇప్పటికే హీరోల రేసులో బాగా వెనుకబడిపోయింది నిఖిల్ కి ఈ సినిమా కూడా హిట్టవకపోతే.. ఇప్పట్లో అతనికి 'హ్యాపీ డేస్ లేవనే అనుకోవాలి!!