లారెన్స్, రితికా సింగ్ కాంబినేషన్లో రూపొందిన 'శివలింగ' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మామూలుగా అయితే లారెన్స్‌కి తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ ఇమేజ్ ఉంది. కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా, నటుడిగా స్టార్డమ్ ఆయన సొంతం. అయినప్పటికీ కూడా 'శివలింగ' సినిమాకి మెయిన్ హీరో రితికా సింగ్ అని చెప్పాడు లారెన్స్. అలా అంత ధైర్యంగా చెప్పడం చాలా కొద్దిమందికే చెల్లుతుంది. 'నేనే హీరోని' అని లారెన్స్ చెప్పుకున్నా కాదనేవారు ఉండరు. ఎందుకంటే లారెన్స్ ఫొటో చూసే ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి. లారెన్స్ డాన్సుల గురించి థియేటర్లకు వెళ్ళే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అయితే లారెన్స్ ఎప్పుడూ బేషజాలకు పోడు, ఉన్నమాట చెప్పడంలో వెనుకంజ వేయడు. ఇంకో వైపున 'గురు' సినిమాతో పాపులర్ అయిన రితికా సింగ్ ఈ సినిమాలో గ్లామరస్‌గా కనిపించనుంది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగా వస్తే అందులో రితికా సింగ్ వాటా కూడా ఎక్కువే. తన గ్లామరస్ పాత్రకీ మంచి మార్కులు పడతాయని రితికా సింగ్ అంటోంది. ఇలాంటి సినిమాల్లో నటించడం కొత్త అనుభూతినిస్తోందని అంటోందామె. లారెన్స్ వ్యాఖ్యలపై స్పందిస్తూ 'అది ఆయన గొప్పతనం. తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం విషయంలో లారెన్స్ చాలా గ్రేట్' అని చెప్పింది రితికా సింగ్.