ప్రార్థించే పెదవుల కంటే, సాయం చేసే చేతులే గొప్పవి. ఈ విషయాన్ని మన సెలబ్రెటీలు అప్పుడప్పుడూ నిజం చేస్తుంటారు. సినిమావాళ్లంటే కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకోవడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు - తమ వంతు సాయం చేసి ఆదుకోగలరు. లారెన్స్ అందుకు అతి పెద్ద ఉదాహరణ. డాన్సర్‌గా, దర్శకుడిగా, నటుడిగా లారెన్స్ సుపరిచితుడే. తన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే పిల్లల చికిత్స కోసం లారెన్స్ చేయూత నందిస్తున్నాడు. లారెన్స్ ఆర్థిక సహాయంతో ఎంతోమంది పిల్లలకు ఆపరేషన్లు జరిగాయి. ఈరోజే 150వ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. అంటే.. లారెన్స్ పేరు చెప్పుకుని 150మంది పిల్లలు కొత్త జీవితాన్ని మొదలెట్టారన్నమాట. ఒకరిద్దరికి ఆపరేషన్లు చేయించడం వేరు. అదే ఉద్యమంగా ఇంతమంది జీవితాల్లో వెలుగు తీసుకురావడం వేరు. నిజంగా లారెన్స్ గ్రేట్ కదూ. ''మీకు తెలిసినవాళ్లెవరైనా గుండె జబ్బుతో బాధపడుతూ, చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉంటే.. నా ఛారిటబుల్ ట్రస్ట్‌కి ఓ ఫోన్ చేయండి. క్షణాల్లో నా సిబ్బంది మీ ముందు ఉంటారు'' అంటున్న లారెన్స్... ఎందరికో ఆదర్శం.