విశాల్‌ని మళ్లీ కెలికిన శ్రీరెడ్డి.!

By iQlikMovies - October 29, 2018 - 16:08 PM IST

మరిన్ని వార్తలు

కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ టాలీవుడ్‌ పరువును బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డి తాజాగా ఓ తమిళ ప్రముఖునిపై ఆరోపణలు చేసింది. ఆ ప్రముఖుడు హీరో విశాల్‌ అని అందరూ అనుకుంటున్నారు. 'నీ సైజ్‌ తెలుసు, నీ కలర్‌ తెలుసు..' అని శ్రీరెడ్డి సదరు వ్యక్తిపై సోషల్‌ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. 

ప్రస్తుతం 'మీ టూ' వివాదం హైప్‌లో ఉన్న ఈ నేపథ్యంలో ఆ విషయమై విశాల్‌ స్పందించాడు. ఓ వ్యక్తిపై ఆరోపణలు చేసేముందు ఆధారాలు చూపిస్తే బావుంటుంది. గతంలో నటి అమలాపాల్‌కి ఇలాగే జరిగింది. అప్పుడు ఆమెకు మేమంతా అండగా నిల్చున్నాం. నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల అనవసరంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు.. అంటూ విశాల్‌ స్పందించాడు. 

అయితే శ్రీరెడ్డి తాజా ఆరోపణలపై విశాల్‌ నుండి ఇంకా రిప్లై రాలేదు కానీ, గతంలోనూ కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై విశాల్‌ని వివాదంలోకి లాగింది శ్రీరెడ్డి. విశాల్‌ తరపు కొందరు వ్యక్తులు తనకు బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను అప్పుడే విశాల్‌ ఖండించాడు. కానీ తాజాగా మరోసారి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో శ్రీరెడ్డి విజృంభించడం సంచలనాత్మకమైంది. దసరా సందర్భంగా 'పందెం కోడి 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్‌. 

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్‌ సంపాదించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ నిమిత్తం విశాల్‌ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే 'మీ టూ' వంటి ఇతర సామాజిక అంశాలపై కూడా విశాల్‌ స్పందిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS