లారెన్స్‌ చేతిలోనే పేలనున్న 'లక్ష్మీబాంబ్‌'!

By iQlikMovies - June 03, 2019 - 19:30 PM IST

మరిన్ని వార్తలు

'కాంచన' హిందీ రీమేక్‌ 'లక్ష్మీబాంబ్‌' దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న లారెన్స్‌ రాఘవ మళ్లీ తానే ఆ ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేస్తున్నానని ప్రకటించారు. నిర్మాతలకూ, దర్శకుడికీ మధ్య వచ్చిన చిన్నపాటి మిస్‌ అండర్‌స్టాండింగ్‌ కారణంగా లారెన్స్‌ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. కానీ, ఈ విబేధాలు తొలిగిపోవడంతో, మళ్లీ ఈ ప్రాజెక్టును తానే టేకప్‌ చేయబోతున్నాననీ లారెన్స్‌ ప్రకటించారు. ఫస్ట్‌లుక్‌ విడుదల కారణంగా తలెత్తిన ఈ వివాదం సద్దుమణగడంతో, ఇప్పుడు మరోసారి 'లక్ష్మీబాంబ్‌' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారట.

 

ఈ సారి లారెన్స్‌ డిజైన్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ని, ఆయన అంగీకారంతో విడుదల చేయనున్నారనీ తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ లుక్‌ రివీల్‌ అయిపోయింది. సో తదుపరి లారెన్స్‌ రిలీజ్‌ చేయబోయే లుక్‌లో ఖచ్చితంగా డిఫరెన్స్‌ చూపించాలి. అందుకోసం లారెన్స్‌ కసరత్తులు మొదలెట్టాడట. ఇంతవరకూ షూట్‌ చేసిన లుక్స్‌లోంచి కాకుండా, ఓ బెస్ట్‌ లుక్‌ని ఫస్ట్‌లుక్‌గా లాంఛ్‌ చేసేందుకు అక్షయ్‌ని సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే ఆ లుక్‌ రిలీజ్‌ కానుందనీ తెలుస్తోంది. కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాలో హిందీ నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని చిన్నా చితకా మార్పులు చేయనున్నారట లారెన్స్‌ రాఘవ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS