'చిన్న దాన నీకోసం..' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని ముద్దు ముద్దుగా పలకరించిన బెంగాలీ బ్యూటీ మిస్తి చక్రవర్తి గుర్తుందా? తెలుగులో ఒకట్రెండు సినిమాలు మాత్రమే ఆ తర్వాత చేసిన మిస్తీ, తాజాగా ఆది సాయికుమార్ సరసన 'బుర్రకథ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. తన సినిమాని ప్రమోట్ చేయడానికో, లేదంటే తనను తాను ప్రమోట్ చేసుకోవడానికోగానీ, ఎప్పుడూ లేని విధంగా డోస్ పెంచి, హాటెస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించేస్తోంది మిస్తి చక్రవర్తి.
ఒకప్పుడు 'గ్లామర్ అంటే నాకు సరిపడదు.. అస్సలేమాత్రం ఎక్స్‌పోజింగ్ చెయ్యను' అని చెప్పిన మిస్తి, ఇదిగో ఇప్పుడిలా టూ పీస్ బికినీలో తాపం పెంచేస్తోంది కుర్రాళ్ళకి. గోవా బీచ్‌లో అమ్మడి ఎంజాయ్‌మెంట్‌ని ఇలా ఆమె సోషల్ మీడియాలో చూసే భాగ్యం కలుగుతోంది. గతంలో కాస్త బొద్దుగా కన్పించిన ఈ బెంగాలీ భామ, ఇప్పుడు ఒంపు సొంపులన్నీ కన్పించేంతా నాజూగ్గా తయారైపోవడం ఆశ్చరర్యకరమే. ఎలాగైతేనేం, గ్లామర్ హద్దులు దాటేసి, బికీనీలో కిర్రాకు పుట్టించేస్తోన్న ఈ బ్యూటీ నుంచి వెండితెరపై వైల్డ్ అండ్ హాట్ షోని ఆశించొచ్చునన్నమాట.