తెలుగు చిత్రసీమలో కొత్తగా పుట్టుకొచ్చిన స్టార్ విజయ్ దేవరకొండ. యువతరంలో విజయ్‌కి అభిమానులు ఎక్కువ. విజయ్ ఫ్యాషన్లను వాళ్లు ఫాలో అవుతున్నారు. విజయ్ సినిమా అంటే సందడి చేసేది వాళ్లే. మరీ ముఖ్యంగా తెలంగాణలో విజయ్‌కి అభిమానగణం ఎక్కువగా ఉంది. విజయ్ సినిమా వస్తోందంటే రెండు వారాల ముందే సందడి మొదలైపోతుంది. అలాంటిది `వరల్డ్ ఫేమస్ లవర్`కి హైపూ, క్రేజూ లేకుండా పోయాయి. కె.ఎస్.రామారావు నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఏకంగా నలుగురు హీరోయిన్లున్నారు. అయినా సరే.. ఈ సినిమాకి ఎలాంటి బజ్ ఏర్పడలేదు.
ఇప్పటి వరకూ విడుదలైన ప్రచార చిత్రాలూ, పాటలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా `డియర్ కామ్రేడ్` ఫ్లాప్ ప్రభావం ఇంకా వుంది. ఆ సినిమా ఫ్లాపుతో విజయ్ సినిమాని కొనడానికి బయ్యర్లు జంకుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా క్రాంతి మాధవ్‌కి ఇప్పటి వరకూ ఒక్క కమర్షియల్ హిట్టు కూడా లేదు. అందుకే.. ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా.. ఏపీ తెలంగాణల్లోనూ ఈసినిమాకి అతి తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయట. నైజాంలో `జానూ` ఎక్కువ థియేటర్లని ఆక్రమించుకుంది. ఫిబ్రవరి 14నాటికి విజయ్ సినిమాకి థియేటర్లు దొరకడం కష్టమే అని టాక్.