లైగర్ రాకకు ఒక్కరోజు మాత్రమే మిగిలుంది. పాన్ ఇండియా ప్రమోషన్స్ ని జోరుగా చేస్తోంది లైగర్ టీం. అయితే తెలుగు మీడియాలో మాత్రం లైగర్ హడావిడి లేదు. వరంగల్, గుంటూరులో చెరొక ఈవెంట్ చేశారు.
లైగర్ కి సంబధించి ఈ ఈవెంట్లు తప్పితే మరొక సందడి కనిపించలేదు. ముఖ్యంగా తెలుగు మీడియా దూరం పెట్టింది లైగర్. లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే.. మీడియాకి ఇంటర్వ్యూ లు ఇవ్వడం కనీస ఆనవాయితీ. ఇంకా ఒక్క రోజే మిగిలింది. విజయ్ దేవర కొండ, పూరి, ఛార్మి, ఎవరూ కూడా మీడియాకి పర్శనల్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈ సినిమాతో అనన్య పాండే తెలుగులోకి పరిచయం అవుతుంది. కనీసం ఆమెతో కూడా ఒక పత్రిక ఇంటర్వ్యూ నిర్వహించలేదు.
ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన విష్ మాత్రమే లైగర్ గురించి ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మిగతావన్నీ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ లో వదిలినవే. ఇటివలే ఒక మీడియా ఇంట్రాక్షన్ విజయ్ మాటలని వివాదం చేశారు. చాలా ట్రోల్ ఎదురుకున్నాడు విజయ్. మళ్ళీ మీడియా ముందుకు వస్తే లేనిపోనీ తలనొప్పి అని భావించారేమో. ఏదేమైనా లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమా తీసిన దర్శకుడు పూరి అయినా .. ఒక రికార్డ్ కోసమైన పత్రికా సమవేశం నిర్వహించడం సముచితం. మరి ఆ దిశగా ఆలోచిస్తారో లేదో చూడాలి.