లైగర్ కోసం దేశంలో రోజుకో సిటీలో తిరుగుతోంది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ కూడా ఆరోగ్యం సహకరించనప్పటికీ కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. నిన్న గుంటూరులో ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఓపెన్ గ్రౌండ్ లో జరిగిన ఈ ఈవెంట్ కి భారీగానే జనాలు వచ్చారు. తమ సినిమా గురించి ప్రేక్షకులతో చెప్పుకుంది లైగర్ యూనిట్. ఐతే లైగర్ ప్రమోషన్స్ లో ఏ ముహూర్తాన వాట్ లగా దేంగే అనే మాట కాయిన్ చేశారో కానీ అదే మాట తెలుగు ప్రమోషన్స్ లో కూడా విచ్ఛలవిడిగా వాడుతున్నారు. ''లైగర్.. వాట్ లగా దేంగే'',.. ఇదే గోల.
హిందీ నుండి వచ్చిన అనన్య పాండే నయం. కుమ్మేస్తాం.. కుమ్మేస్తుందని వచ్చిరానీ తెలుగులో ఎదో ప్రయత్నిస్తుంది. కానీ విజయ్ దేవరకొండ మొదలు మిగతా యూనిట్ అంతా వాట్ లగా దేంగే అనే ఒక్క మాటతో ప్రమోషన్స్ చేస్తున్నారు. 'వాట్ లగా దేంగే' ముంబైలో విరివిగా వాడే మాట. దీనికి తెలుగులో అర్ధం చెప్పాలంటే.., ఇరగొట్టడం.. దుమ్మురేపేయడం, దింపేయడం ఇలాంటి మాస్ మాటలు వస్తాయి. అదే మాట పట్టుకొని లైగర్.. వాట్ లగా దేంగే అంటూ పాటపాడుతోంది యూనిట్.
అయితే ఈ విషయంలో పూరి మాత్రమే మినహాయింపు. ఆయన ఒక్కడు మాత్రమే.. 'మా సినిమా 25 వస్తోంది. బావుంటుంది. చూడండి'' అని ఒక పద్దతిగా కమ్యునికేట్ చేస్తున్నారు.