'అర్జున్‌రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిన సంగతే. ముఖ్యంగా యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించేశాడీ యంగ్ హీరో. ఇంత క్రేజ్ రావడానికి ఈ సినిమాలో ఏముంది అంటే, లిప్‌లాక్స్. హీరోయిన్‌తో హీరో విజయ్‌దేవరకొండ చేసిన రొమాంటిక్ లిప్‌లాక్ సీన్స్ ఓ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పక తప్పదు.
అలా ఇప్పుడు ఆకాష్ పూరీ కూడా క్రేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడట. పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా 'మెహబూబా' సినిమా తెరకెక్కుతోంది. తన సొంత బ్యానర్లో పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొడుకును హీరోగా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయడానికి పూరీ జగన్నాధ్ చాలానే ట్రిక్స్ యూజ్ చేశాడట. అసలే పూరీకి హీరోలను ప్రెజెంట్ చేయడంలో క్రియేటివ్ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని హీరోలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటప్పుడు తన కొడుకు విషయంలో ఇంకెంత జాగ్రత్త తీసుకుని ఉండాలి. రొమాంటిక్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గుర్తుండిపోయే రొమాంటిక్ సీన్స్‌తో పాటు, హీరో, హీరోయిన్‌కి మధ్య లిప్‌లాక్స్ కూడా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
గాఢమైన లిప్‌లాక్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయట. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఈ రొమాంటిక్ మూడ్ ఆడియన్స్‌ని ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ని కట్టిపడేయనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందకు రానున్న ఈ సినిమాతో నేహాశెట్టి హీరోయిన్గా పరిచయమవుతోంది.