మర్డర్‌ మిస్టరీ: నీడ లేని 'నెపోలియన్‌'

మరిన్ని వార్తలు

'నెపోలియన్‌' సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పుడు అంతా షాక్‌కి గురయ్యారు. నీడ లేకపోవడమేంటి? అన్న ఆలోచనే చిత్రమైనది. ఆ నీడ కోల్పోయిన వ్యక్తి, తన నీడ కోసం పోలీసులను ఆశ్రయించడం ఇంకా ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌. అయితే, ట్రైలర్‌ వచ్చాకే అసలు విషయం బయటకొచ్చింది. ఓ వ్యక్తి తన నీడ పోయిందని పోలీసులకు చెప్పడం వెనుక ఓ మర్డర్‌ మిస్టరీ ఉంటుంది. దాన్ని ఛేదించే క్రమంలో ఆ సామాన్యుడు దేవుడి సాయం తీసుకుంటాడని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. దేవుడు చెప్పాడు, అది యాక్సిడెంట్‌ కాదు మర్డర్‌ అని అంటూ పోలీసులకు వివరిస్తాడో సామాన్యుడు. అలా వచ్చిన వ్యక్తి తన పేరుని నెపోలియన్‌గా చెప్పుకుంటే, ఆ పేరు తప్పనీ అతని పేరు ఇంకోటేదో అని ఓ మహిళ చెబుతుంది. దేవుడే అయినాసరే మనకి అడ్డం అనుకుంటే అడ్డు తొలగించుకోవాల్సిందేనని ఓ డైలాగ్‌ విన్పిస్తుంటుంది. సామాన్యుడి సోషల్‌ రెస్పాన్సిబులిటీ గురించి ఆసక్తికరమైన డైలాగ్‌ ఒకటుంది. చెప్పుకుంటూ వెళితే ట్రైలర్‌ మీదనే ఓ పెద్ద కథ రాయొచ్చు. కాన్సెప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. మరి సినిమాని దర్శకుడెలా తెరకెక్కించాడో. 'ప్రతినిథి' ఫేం ఆనంద్‌ రవి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ 'నెపోలియన్‌' సినిమా సభ్య సమాజానికి ఓ మంచి మెసేజ్‌ ఇచ్చేలానే అన్పిస్తోంది. ఆచార్య క్రియేషన్స్‌ పతాకంపై భోగేంద్రగుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే, ఈ 'నెపోలియన్‌' కాన్సెప్ట్‌ అందర్నీ ఆకర్షించేలానే ఉంది. హిట్‌ గ్యారంటీ అనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS