‘సీటీమార్‌’లో ‘జ్వాలా రెడ్డి’గా తమన్నా.!

By Inkmantra - February 08, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీ మార్‌’. కబడ్గీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్‌ హీరోగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్‌గా తమన్నా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘జ్వాలారెడ్డి’గా తమన్నా పాత్రను పరిచయం చేశారు. బ్యాక్‌ ప్యాక్‌ వేసుకుని చాలా కోపంగా నడుచుకుని వస్తున్నట్లు ఈ లుక్‌లో తమన్నా కనిపిస్తోంది. ఈ సినిమాలో లేడీ కబడ్డీ కోచ్‌గా తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకూ ఎప్పుడూ తమన్నా స్పోర్ట్స్‌ నేపథ్యమున్న పాత్రల్లో కనిపించింది లేదు. అందుకే ఈ సినిమాలో ‘జ్వాలా రెడ్డి’ పాత్ర తనకెంతో స్పెషల్‌ అంటోంది.

 

పేరుకు తగ్గట్లుగానే లుక్స్‌లో ఆ ఫైర్‌ కనిపిస్తోంది. ఇక ఇటీవల టైటిల్‌ లోగోతో పాటు, గోపీచంద్‌ ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌కి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సంపత్‌నంది ` గోపీచంద్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గౌతమ్‌ నందా’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడట సంపత్‌నంది. ప్రస్తుతం స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీస్‌కి మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో సంపత్‌ ` గోపీచంద్‌ ‘సీటీమార్‌’ అనిపిస్తారేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS