ఎందరో మహానుభావులు మరణిస్తుంటారు. వారితో పెనవేసుకున్న అభిమానంతో అశేష ప్రజానీకం కొంత సమయం రోదిస్తారు, బాధపడతారు, దిగులు చెందుతారు. తర్వాత మర్చిపోతారు.
అయితే అక్కడితో ఆపేయకుండా ఆ మహానుభావులనుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ప్రస్తావించుకుంటే నిజంగానే బాగుంటుంది కదా.
ఏ అంశాలు వారిని మహానుభావుల జాబితాలోకి చేర్చాయో చెప్పమంటే "ట్యాలెంట్" అనో "మంచితనం" అనో ఒక్క పదంలో సమాధానం చెప్పేస్తుంటారు.
అలా కాకుండా "లక్ష్మీస్ ఎంటీయార్" వంటి సినిమాలకు గీతరచయితగా పనిచేసిన సిరాశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో తనకు గల పరిచయాన్ని పంచుకుంటూనే సోషల్ మీడియా ద్వారా ఆయన నుంచి నేర్చుకు తీరాల్సిన అంశాలు అంటూ కొన్ని పాయింట్స్ ప్రస్తావించారు.
అవి ఏమిటంటే:
1. నిరంతరం సాధన చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం
2. మనుషుల్ని పేర్లతో సహా గుర్తుపెట్టుకోవడం
3. ప్రేమగా పలకరించడం
4. ఎంత ఎదిగినా ఎదుటివారికి సమాన మర్యాదనివ్వడం
5. వినయంతో జీవించడం
6. సెన్సాఫ్ హ్యూమర్ ని వదలకపోవడం
7. లైవ్లీగా, యాక్టివ్ గా ఉండడం
8. వృత్తిని విపరీతంగా ప్రేమించడం
9. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యువతతో పోటీ పడడం
10. ఎవరి గురించీ నెగటివ్ గా మాట్లాడకపోవడం
11. చేస్తున్న వృత్తిలో కొత్తవారిని ఎంకరేజ్ చేయడం
12. ఓపికున్నంత వరకు నిర్విరామంగా పని చేయడం
13. అంపశయ్య మీద కూడా నిరాశ చెందకుండా ఉండగలడం
పై వాటిలో 2వది గిఫ్టే అయినా, మిగతావన్నీ సాధనతో సాధించవచ్చు.
ఈ పాయింట్స్ ప్రస్తావిస్తూ, తాను వ్రాసిన పాటలు కొన్ని బాలుగారి గళంలో రికార్డ్ అయినందుకు ఈ జన్మకు ఇది చాలని సిరాశ్రీ ఫేస్ బుక్ లో వ్యక్తపరిచారు.