వారిద్ద‌రి వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌డం లేదా?

మరిన్ని వార్తలు

'మా' ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చాయి. అద్యక్షుడిగా విష్ణు గెలిచాడు. అయితే అక్కడితో అయిపోలేదు. మా ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. మొన్న మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. నేడు ప్రకాష్ రాజ్ ప్యానల్లో గెలిచిన ఈసీ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన అంతా వింటే.. విష్ణుతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. వారికి వున్న ఇబ్బందంతా మోహన్ బాబు, నరేష్ లతోనే. ప్రెస్ మీట్ లో శ్రీకాంత్, బెనర్జీ, ప్రభాకర్, ఉత్తేజ్, తనీష్ .. ఇలా ఎవరు మాట్లాడిన విష్ణు బాబు మంచోడనే చెబుతున్నారు. వాళ్ళ ఇబ్బందంతా మోహన్ బాబు, నరేష్ లతోనే.

 

బెనర్జీ అయితే ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. తన జీవితంలో ఎవరూ నన్ను అంతగా అవమానించలేదని, మోహన్ బాబు అరగంట పాటు అమ్మనాబూతులు తిట్టారని, కొట్టడానికి వచ్చారని, నేను ఇంకా షాక్ లోనే వున్నాని కన్నీటిపర్యంతమయ్యారు. 'విష్ణు నాకు బ్రదర్ లాంటి వాడు. నరేశ్‌ చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం ఇచ్చాడు. ఆయన డైరెక్షన్ లో విష్ణు బాగానే పనిచేస్తాడు. అందుకే ఈసారికి 'మా'ని వారికే వదిలేస్తున్నాం''అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

 

ఈటీవీ ప్రబాకర్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ''ఈ ఎన్నికల్లో విష్ణు పోటి చేసినట్లు లేదు. మోహన్ బాబు, నరేష్ కలసి పోటి చేసినట్లు విష్ణు కేవలం సభ్యుడైనట్లు అనిపించింది. అమ్మో అవేం బూతులు అండీ బాబు. బెనర్జీ గారు ఊరుకున్నారు కానీ.. నిజానికి విష్ణు, మనోజ్ లేకపొతే పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పుకొచ్చాడు.

 

తనీష్ ఏడ్చేశాడు. అమ్మని తిడుతుంటే ఏడుపు ఆపుకోలేకపోయానని బాధ పడ్డాడు. ఉత్తేజ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. నరేష్ మాట్లాడిన ఓ నీచమైన తిట్టుని సగం చెప్పి ఆపేశాడు. ప్రకాష్ అయితే తన ముందు మాటలోనే మా ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని చెప్పారు.

 

ప్రకాష్ రాజ్ ప్యానల్ మాటలు చూస్తుంటే వారి ద్రుష్టిలో మెయిన్ విలన్ గెలిచిన విష్ణు కాదు. మోహన్ బాబు, నరేష్ లని టార్గెట్ చేస్తూ వారి ప్రెస్ మీట్ సాగింది. అయితే మోహన్ బాబు పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మోహన్ బాబు తీరు నీచంగా వుందని వారి ఆరోపణ. దీనికి సమాధానం చెప్పాల్సిన నైతిక భాద్యత కూడా మోహన్ బాబుపై వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS