ప్రముఖ నటుడు-నిర్మాత అయిన మాదాల రంగారావు (69) గారు ఇక లేరు.
పూర్తి వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్స్ లో చికిత్సపొందుతున్న రంగారావు గారు ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1958 మే 25న ఒంగోలు లో జన్మించిన ఈయన తన సినీ కెరీర్ మొదటి నుండి కూడా కూడా సమాజంలో మార్పుని తెచ్చే విధంగా అ మార్పుని ప్రోత్సహించే విధంగానే సినిమాలు తీయడం జరిగింది. దీనికి ప్రజానాట్య మండలికి ఆయనకీ ఉన్న సాన్నిహిత్యమే కారణం అని చెప్పొచ్చు.
సొంతగా నవతరం పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని నెలకొలిపి అనేక చిత్రాలని నిర్మించారు. ఆ చిత్రాలన్నీ సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలని అరికట్టే నేపధ్యంలోవి కావడంతో ఈయనకి రెడ్ స్టార్ అనే బిరుదు కూడా రావడం జరిగింది. ఆయన తీసిన చిత్రాలలో కొన్ని- యువతరం కదిలింది, ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజా శక్తి, స్వరాజ్యం, యెర్ర సూర్యుడు.
మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు.
మాదాల రంగారావు గారి అకాల మృతికి మా www.iQlikmovies.com తరపున సంతాపం తెలియచేస్తున్నాము.