నరేష్‌ హీరోయిన్‌కి పెళ్లైపోతోందహో.!

మరిన్ని వార్తలు

తెలుగులో అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన 'ఫిట్టింగ్‌ మాస్టర్‌' చిత్రంలో నటించిన బ్యూటీ మదాల్సా శర్మ గుర్తుంది కదా. ఈ బ్యూటీ త్వరలోనే ఓ ఇంటిది కానుంది. 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిధున్‌ చక్రవర్తి తనయుడు మహాక్షయ్‌తో ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. గత మూడేళ్లుగా పీకల్లోతు లవ్‌లో ఉన్న ఈ ఇద్దరూ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుందుకు రెడీ అవుతున్నారు. జూలై 7న వీరి వివాహం జరిపించుటకు ముహూర్తం కుదిర్చారు ఇరు కుటుంబాల పెద్దలు. వీరిద్దరూ లవ్‌లో పడక ముందే ఈ ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. 

ఇకపోతే తెలుగులో 'ఫిట్టింగ్‌ మాస్టర్‌' తర్వాత 'ఆలస్యం అమృతం విషం', 'చిత్రం చెప్పిన కథ' తదితర తెలుగు సినిమాల్లో నటించింది ముద్దుగుమ్మ మదాల్స శర్మ. తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒకే ఒక చిత్రంలో నటించింది. మహాక్షయ్‌ 'జిమ్మి' అనే చిత్రంలో నటించాడు. తండ్రి మిధున్‌ చక్రవర్తికి బాలీవుడ్‌లో నటుడిగా మంచి పేరుంది. కానీ, కొడుకు మహాక్షయ్‌ మాత్రం హీరోగా అంత పాపులారిటీ సంపాదించుకోలేకపోయాడు. 

కాగా ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వార్త బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ మధ్యనే శ్వేతాబసు ప్రసాద్‌ తన పెళ్లి వార్తను ప్రకటించింది. త్వరలోనే తన బోయ్‌ ఫ్రెండ్‌ని వివాహమాడబోతున్నానని శ్వేతాబసు చెప్పింది. ఈ లోగానే మదాల్స పెళ్లి డేట్‌ కూడా అనౌన్స్‌ చేసేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS